దక్షిణ కొరియా అధ్యక్షుడితో ఫోన్ లో సంభాషించిన ప్రధాని మోదీ

  • దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్
  • ‘కరోనా’ నిరోధానికి చేపట్టిన తమ దేశాల్లో చేపట్టిన చర్యల ప్రస్తావన
  • ఆరోగ్య వ్యవస్థలు, ఆర్థిక పరిస్థితులకు ఎదురయ్యే సవాళ్లపై కూడా
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వణికిస్తున్న నేపథ్యంలో దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్ , భారత ప్రధాని మోదీ లు టెలిఫోన్ ద్వారా ఈరోజు సంభాషించుకున్నారు. ‘కోవిడ్-19’ మహమ్మారి కారణంగా ప్రపంచ ఆరోగ్య వ్యవస్థలు, ఆర్థిక పరిస్థితులకు ఎదురయ్యే సవాళ్ల పై ఇరు దేశాధి నేతలు చర్చించినట్టు సమాచారం. ‘కరోనా’ ను అరికట్టేందుకు తమ దేశాల్లో తీసుకున్న చర్యల గురించి మోదీ, మూన్ జేలు పరస్పరం పంచుకున్నారు. ఈ సందర్భంగా గత ఏడాదిలో తాను కొరియా పర్యటనకు వెళ్లిన విషయాన్ని మోాదీ గుర్తుచేసుకున్నారు. ఇరు దేశాల మధ్య పెరుగుతున్న సన్నిహిత సంబంధాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.

‘కరోనా’ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కొరియా అనుసరిస్తున్న పద్ధతులపై మోదీ ప్రశంసలు కురిపించారు. అదే విధంగా, ‘కరోనా’ వ్యాప్తి చెందకుండా భారత్ ప్రజలు కలిసికట్టుగా ఉండటాన్ని మూన్ జే కొనియాడారు. ‘కోవిడ్-19’ను నివారణకు సంబంధించి చేసే రీసెర్చి సొల్యూషన్స్ పై ఇరు దేశాల నిపుణుల సంప్రదింపులు పరస్పరం కొనసాగేందుకు, తమ అనుభవాలు పంచుకునేందుకు ఇద్దరు నేతలు అంగీకరించినట్టు సమాచారం.


More Telugu News