వైద్య సిబ్బంది మా హోటల్‌లో విశ్రాంతి తీసుకోవచ్చు: సోనూ సూద్
- కరోనా రోగులకు చికిత్స చేస్తున్న సిబ్బందికి ఆఫర్
- ముంబైలోని తన హోటల్‌ను వారికి కేటాయిస్తానని వెల్లడి
- వారికి సాయం చేయడాన్ని గౌరవంగా భావిస్తానన్న సోనూ
విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బాలీవుడ్, టాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న నటుడు సోనూ సూద్ తన మంచి మనసు చాటుకున్నాడు. కరోనా వైరస్ పై పోరాటంలో విశేష కృషి చేస్తున్న వైద్య సిబ్బందికి సాయం చేసేందుకు ముందుకొచ్చాడు. కరోనా వైరస్ రోగులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందికి ముంబైలోని తన హోటల్‌ను ఇచ్చేందుకు ముందుకొచ్చాడు. సిబ్బంది తన హోటల్లో ఉండొచ్చని చెప్పాడు. ఈ విషయాన్ని ఇప్పటికే ముంబై మున్సిపల్ అధికారులు, ప్రైవేట్ ఆసుపత్రుల దృష్టికి తీసుకెళ్లినట్టు వెల్లడించాడు.
కరోనాపై పోరాడుతున్న వారికి సాయం చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నట్టు సోనూ సూద్ తెలిపాడు. ‘ప్రజల ప్రాణాలను కాపాడేందుకు రోజంతా శ్రమిస్తున్న వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బందికి చిన్న సాయం చేసే అవకాశాన్ని గౌరవంగా భావిస్తున్నా. వాళ్లంతా ముంబైలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి సేవ చేస్తున్నారు. వాళ్లు విశ్రాంతి తీసుకునేందుకు ఒక చోటు కావాలి. అందుకు మా హోటల్‌ను వినియోగించుకోవాలని మున్సిపల్, ప్రైవేట్ ఆసుపత్రులకు తెలిపాము’ అని సోనూసూద్ పేర్కొన్నాడు. కాగా, ముంబై లోని జుహూ ప్రాంతంలో సోనూసూద్ కుటుంబానికి ఆరంతస్తుల హోటల్ వుంది.