అత్యవసర ఔషధాలు సరఫరా చేయాలని భారత్‌ను కోరిన స్పెయిన్

  • కేంద్ర మంత్రి జైశంకర్ కు ఆ దేశ విదేశాంగ మంత్రి ఫోన్
  • భారత్ సానుకూలంగా స్పందించిందన్న జై శంకర్
  • కరోనాతో స్పెయిన్‌లో 14వేల పైచిలుకు మరణాలు
కరోనా వైరస్‌ పరిస్థితిపై స్పెయిన్ విదేశాంగ మంత్రి అరంచా గొంజాలెజ్‌తో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ చర్చించారు. నిన్న వీరిద్దరూ ఫోన్‌లో మాట్లాడుకున్నారు. తమ దేశానికి అత్యవసర ఔషధాలు సరఫరా చేయాలని స్పెయిన్ చేసిన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించినట్టు జై శంకర్ తెలిపారు.

‘స్పెయిన్ ఫారిన్‌ మినిస్టర్ అరంచా గొంజాలెజ్‌తో ఫోన్‌లో మాట్లాడా. కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాల సహకారం అవసరం అని మేమిద్దరం అంగీకరించాం. అలాగే, స్పెయిన్‌కు అత్యవసర ఔషధాలు సరఫరా చేయాలన్న విజ్ఞప్తిపై
భారత్ సానుకూలంగా స్పందించింది’ అని జై శంకర్ ట్వీట్ చేశారు. స్పెయిన్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి దారుణంగా ఉంది. ఆ దేశంలో ఇప్పటికే 1.48 లక్షల మంది వైరస్ బారిన పడ్డారు. 14 వేల మందికి పైగా చనిపోయారు.


More Telugu News