టీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య మృతి
- గత కొంతకాలంగా అనారోగ్యం
- కాసేపటి క్రితం స్వగృహంలో తుదిశ్వాస
- సిర్పూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపు
టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య (68) అనారోగ్యంతో ఈరోజు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఆయన కాసేపటి క్రితం స్వగృహంలోనే తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సమ్మయ్య సుదీర్ఘకాలంగా టీఆర్‌ఎస్‌కు సేవలందిస్తున్నారు.
సిర్పూరు నియోజకవర్గం నుంచి 2009, 2011లో టీఆర్‌ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2014లో బీఎస్పీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 2018 ముందస్తు ఎన్నికల ముందు మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ అయిన తన భార్య సాయిలీలతో కలిసి టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. కాగా, సమ్మయ్య మరణవార్త తెలిసిన సీఎం కేసీఆర్ తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీకి ఆయన సేవలను గుర్తు చేసుకుని కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.