లాక్ డౌన్ ఏప్రిల్ 30 వరకు పొడిగింపు.. ప్రకటించిన తొలి రాష్ట్రంగా ఒడిశా
- కరోనా కేసులు తగ్గు ముఖం పట్టకపోవడంతో నిర్ణయం
- రైలు, విమాన సేవలను ఏప్రిల్ 30 వరకు ప్రారంభించవద్దని విజ్ఞప్తి
- ఒడిశాలో విద్యా సంస్థలు జూన్ 17 వరకు బంద్
కరోనా కేసులు తగ్గు ముఖం పట్టకపోవడంతో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటన చేసింది. లాక్‌డౌన్‌ను పొడిగించిన తొలి రాష్ట్రం ఒడిశానే. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఒడిశా ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వానికి పలు విజ్ఞప్తులు చేశారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా రైలు, విమాన సేవలను ఏప్రిల్ 30 వరకు ప్రారంభించవద్దని తెలిపారు.
తమ రాష్ట్రంలో విద్యా సంస్థలు జూన్ 17 వరకూ తెరవబోమని నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. 'రాష్ట్రంలో లాక్‌డౌన్ పొడిగింపుపై ఒడిశా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ను దేశ వ్యాప్తంగానూ పొడిగించాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసింది' అని ఒడిశా ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చింది. లాక్‌డౌన్ పొడిగించాల్సిందేనని ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
'ఈ శతాబ్దంలోనే కరోనా వైరస్ మానవాళికి అతి పెద్ద ముప్పుగా పరిణమించింది. జీవితం మునుపటిలా ఇక ఉండదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి.. అందరూ కలిసి ఎదుర్కోవాలి' అని నవీన్ పట్నాయక్ వ్యాఖ్యానించారు.
లాక్‌డౌన్ ను పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే, లాక్‌డౌన్‌తో ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశం ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై లోతుగా ఆలోచిస్తోంది..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు మేధావులు, రాజకీయ పార్టీల నేతలు, వైద్య, ఆర్థిక రంగ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ ఈ నెల 14తో ముగుస్తుంది. లాక్‌డౌన్ విధించినప్పటికీ కరోనా కేసులు ఇప్పటికీ తగ్గుముఖం పట్టకపోవడం ఆందోళన కలిగిస్తోన్న నేపథ్యంలో తమ రాష్ట్రాల్లో దాన్ని పొడిగించాలని పలు రాష్ట్రాల ప్రభుత్వాలు యోచిస్తున్నాయి.