కరోనా నివారణకు రక్షజ్ఞ ధూపం.. ఎస్వీ ఆయుర్వేద కళాశాల తయారీ

  • చేతులు శుభ్రం చేసుకునే శానిటైజర్‌ కూడా
  • ముక్కులో పోసుకునే చుక్కల మందు రెడీ
  • విడుదల చేసిన టీటీడీ జేఈఓ బసంత్‌కుమార్‌ 
ప్రస్తుతం కరోనా భయపెడుతున్న నేపధ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీవేంకటేశ్వర ఆయుర్వేద కళాశాల, ఆసుపత్రి పరిశోధకులు ఐదు రకాలైన ఔషధాలను తయారు చేశారు. ప్రస్తుతం కరోనా నివారణకు జనం వాడుతున్న స్ప్రేయర్లు, శానిటైజర్లు, పుక్కిలించే మందు, చుక్కల మందుతోపాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు ప్రత్యామ్నాయ  మందులను రూపొందించారు.

గాలిలోని క్రిములను నాశనం చేసేందుకు రక్షజ్ఞ ధూపం రూపొందించారు. ప్రస్తుతం సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణం పిచికారీ చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే చేతులు శుభ్రపరుచుకునేందుకు ‘పవిత్ర’ ద్రావణం, పుక్కిలించే మందు 'గండూషం', ముక్కులో పోసుకునే చుక్కల మందు నింబనస్యం, వ్యాధి నిరోధక శక్తిని పెంచే ‘అమృత’ మాత్రలను తయారు చేశారు. పరిశోధకులు రూపొందించిన వీటిని తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓ పి.బసంత్‌కుమార్‌ మార్కెట్లోకి విడుదల చేశారు.


More Telugu News