జగన్‌గారూ... వైద్యులు, సిబ్బంది రక్షణ బాధ్యత కూడా మీదే!: ట్విట్టర్‌లో చంద్రబాబు
- వారు ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్నారు
- వారికి తగిన రక్షణ పరికరాలు అందజేయండి
- అనంతపురం కేసుల్లాంటివి పునరావృతం కాకూడదు
ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో వైద్యులు, సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి బాధితులకు సేవలందిస్తున్నారని, అటువంటి వారి ఆరోగ్య పరిరక్షణకు తగిన పరికరాలు సరఫరా చేయాల్సిన బాధ్యత ఏపీ ప్రభుత్వంపై ఉందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీఎం జగన్ ను కోరారు.
ఈ మేరకు ట్విట్టర్‌లో ఆయన సూచనలు చేశారు. అనంతపురం జిల్లాలో కరోనా పాజిటివ్‌తో చనిపోయిన 64 ఏళ్ల వృద్ధుడికి చికిత్స అందించిన ఇద్దరు వైద్యులు, నలుగురు సిబ్బందికి పాజిటివ్ వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సరైన రక్షణ పరికరాలు లేని దుస్థితిని ఈ సంఘటన తెలియజేస్తోందని, ఇప్పటికైనా వైద్య సిబ్బందికి భరోసా కల్పించే రక్షణ పరికరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందుకోసం ఎంత మొత్తమైనా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని కోరారు.