వాహన చోదకులకు ‘టెక్నాలజీ’తో ముకుతాడు: హైదరాబాద్ పోలీసుల ప్రయోగం
- మూడు కిలోమీటర్లు దాటి వెళితే కంట్రోల్ రూంకు సమాచారం
- కేసు నమోదు చేయనున్న పోలీసులు
- నిబంధనలు ఉల్లంఘిస్తే జైలు శిక్షే
లాక్‌డౌన్ నేపథ్యంలో వాహన చోదకుల కట్టడికి హైదరాబాద్ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని (టెక్నాలజీ) ఉపయోగిస్తున్నారు. నిత్యావసరాల కోసం సడలింపును ఆసరాగా తీసుకుని పలువురు దూర ప్రయాణాలు చేస్తున్నారు. దీన్ని కట్టడి చేసేందుకు పోలీసు రవాణా శాఖ రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో నిఘా పెడుతున్నారు.
దీనివల్ల వాహన చోదకుడు తన ఇంటి నుంచి మూడు కిలోమీటర్ల దూరం దాటి వెళితే వాహనం నంబర్‌ప్లేట్ ఫొటో సహా ఆ సమాచారం కంట్రోల్ రూంకు చేరుతుంది. సీసీ కెమెరా ఫీడ్‌బ్యాక్ ఆధారంగా వాహన చోదకులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారో గుర్తిస్తారు. నిబంధనను ఉల్లంఘించారని తేలితే కేసు నమోదు చేస్తారు. పూర్తి ఆధారాలతో కోర్టుకు హాజరు పరిచిన తర్వాత జరిమానాతోపాటు జైలు శిక్ష పడినా ఆశ్చర్యపోనవసరం లేదని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నగరంలోని అన్ని కూడళ్లలో వాహన చోదకుల డేటా తయారు చేస్తున్నారు.