బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం

  • కరోనా ప్రబలిన నేపథ్యంలో నిషేధం
  • తక్షణం అమల్లోకి
  • ప్రజా భద్రత దృష్ట్యా నిర్ణయం 
రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు భయపెడుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని నిషేధించింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

దీని ప్రకారం బహిరంగ ప్రదేశాలు, సంస్థలు, కార్యాలయాలు, రోడ్లపై పాన్, తంబాకును నమిలి ఉమ్మివేయడం నిషేధం. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉమ్మివేయడం, శుభ్రత లేకపోవడం వల్ల ఇన్ఫెక్షన్లు వ్యాపించే అవకాశం ఉందని, అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ప్రజారోగ్యం, భద్రతను దృష్టిలో పెట్టుకుని బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడాన్ని నిషేధించినట్టు తెలిపారు.


More Telugu News