ఏపీకి చెందిన 10 మందిపై ఉత్తరప్రదేశ్‌లో కేసు నమోదు
- తబ్లిగీ జమాత్ సదస్సుకు హాజరై యూపీలో తలదాచుకున్న వైనం
- ఆశ్రయమిచ్చిన 50 ఏళ్ల వ్యక్తి
- వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 10 మంది తబ్లిగీ జమాత్ సభ్యులపై ఉత్తరప్రదేశ్‌లో కేసు నమోదైంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్ సదస్సుకు హాజరైన వీరంతా తిరిగి ఏపీకి రాకుండా ఉత్తరప్రదేశ్‌లో తలదాచుకున్నారు.
భవార్సీలోని శాంగిబెగ్ ప్రాంతానికి చెందిన 50 ఏళ్ల వ్యక్తి వీరికి ఆశ్రయమిచ్చినట్టు తేలింది. అతడికి కరోనా ఉన్నట్టు నిర్ధారణ కావడంతో అప్రమత్తమైన పోలీసులు ఆ ప్రాంతం మొత్తాన్ని దిగ్బంధించారు. ఆ సమయంలో ఏపీకి చెందిన 10 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై అంటువ్యాధుల నిరోధక చట్టం, విపత్తు నిర్వహణ చట్టం కింద కేసులు నమోదు చేశారు. వారి నుంచి నమూనాలు సేకరించి పరీక్షల కోసం పంపించారు.