అంబేద్కర్ జయంతి ఇక జాతీయ సెలవు దినం: ప్రకటించిన కేంద్రం
- ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి
- సెలవు దినంగా ప్రకటించాలంటూ చాలా కాలంగా డిమాండ్
- దేశంలోని అన్ని కార్యాలయాలు, పరిశ్రమలకు సెలవు వర్తిస్తుందన్న కేంద్రం
భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 14ను జాతీయ సెలవు దినంగా కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ తెలిపారు. దేశంలోని అన్ని కార్యాలయాలు, అన్ని పరిశ్రమలకు ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. అంబేద్కర్ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలన్న డిమాండ్ చాలాకాలంగా ఉంది. ఇప్పుడు కేంద్రం ఈ ప్రకటన చేయడంతో సర్వత్ర హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా, కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ గడువు ఈ నెల 14తో ముగియనుంది. అయితే, మరికొంత కాలం లాక్‌డౌన్‌ను కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నెల 11న ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా లాక్‌డౌన్ పొడిగింపుపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.