మెరుగుపడుతున్న బ్రిటన్ ప్రధాని ఆరోగ్యం.. చికిత్సకు స్పందిస్తున్న బోరిస్

  • గత నెలలోనే కరోనా బారినపడిన బోరిస్
  • కోలుకుంటున్నారన్న ప్రధాని కార్యాలయం
  • వెంటిలేటర్ సాయం లేకుండానే శ్వాస తీసుకుంటున్నారన్న మంత్రి
కరోనా వైరస్ బారిన పడి లండన్‌లోని సెయింట్ థామస్ ఆసుపత్రిలో చేరిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్సకు ఆయన స్పందిస్తున్నారని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. ఆయన ఆరోగ్యం క్లినికల్లీ స్టేబుల్ అని డౌనింగ్ స్ట్రీట్ అధికార ప్రతినిధి తెలిపారు. మంత్రివర్గ సహచరులతోను, అధికారులతోనూ ఆయన మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.

బోరిస్‌కు ప్రస్తుతం స్టాండర్డ్ ఆక్సిజన్ చికిత్స అందిస్తున్నట్టు ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ఎడ్వర్డ్ అర్గర్ తెలిపారు. వెంటిలేటర్ సహాయం లేకుండానే ఆయన శ్వాస తీసుకుంటున్నారని పేర్కొన్నారు. కాగా, బోరిస్ గత నెలలోనే కరోనా బారినపడ్డారు. పది రోజులపాటు స్వీయ నిర్బంధంలో ఉండి చికిత్స తీసుకున్నారు. అయినప్పటికీ ఆయనలో కరోనా లక్షణాలు తగ్గకపోవడంతో ఆదివారం ఆసుపత్రికి తరలించారు.


More Telugu News