కష్టకాలంలో పన్నుచెల్లింపు దారులకు ఐటీ శాఖ శుభవార్త
- పెండింగ్‌లో ఉన్న రిఫండ్‌ల తక్షణ విడుదలకు అంగీకారం
- రూ. 5 లక్షల లోపు రిఫండ్‌లకు వర్తింపు
- ఇందుకు రూ. 18 వేల కోట్లు విడుదల చేయాలని నిర్ణయం
ఒకవైపు వేగంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి భయం.. మరోవైపు లాక్‌డౌన్‌తో ఇబ్బంది పడుతున్న వారికి ఆదాయపు పన్ను శాఖ శుభవార్త చెప్పింది. పెండింగ్‌లో ఉన్న రిఫండ్‌లను తక్షణమే విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.
రూ. ఐదు లక్షల లోపు ఉన్న రిఫండ్‌లను వెంటనే విడుదల చేసేందుకు ఐటీ శాఖ చర్యలు చేపట్టనుంది. దీని వల్ల దాదాపు 14 లక్షల మందికి ఊరట లభించనుంది. అలాగే, జీఎస్‌స్టీ, కస్టమ్స్ సుంకం చెల్లించే మరో లక్ష మంది వ్యాపారులకు కూడా ఉపశమనం కలగనుంది. సూక్ష్మ, చిన్న, మధ్య శ్రేణి వ్యాపార సంస్థ (ఎంఎస్ఎంఈ)లకు కూడా ఇది వర్తించనుంది. ఈ రిఫండ్‌ల కోసం ఐటీ శాఖ మొతం రూ. 18 వేల కోట్లు విడుదల చేయనుంది.