నిజాలు చెబితే సస్పెండ్ చేయడం మంచిది కాదు: టీడీపీ ఎంపీ కేశినేని నాని
- ప్రభుత్వ వైద్యుడు సుధాకర్ ను సస్పెండ్ చేయడం తగదు
- మహమ్మారితో పోరాడుతున్న డాక్టర్ల మనోస్థైర్యo దెబ్బతీయొద్దు
- డాక్టర్లకు అన్ని సదుపాయాలు సమకూర్చాలి
ఏపీకి చెందిన ప్రభుత్వ వైద్యుడు సుధాకర్ ను సస్పెండ్ చేయడంపై విమర్శలు తలెత్తుతున్నాయి. ఈ విషయమై ఏపీ ప్రభుత్వంపైనా, సీఎం జగన్ పైనా ప్రతిపక్ష టీడీపీ నేతలు ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని కూడా స్పందించారు.
‘కరోనా మహమ్మారితో పోరాడుతున్న డాక్టర్ల మనోస్థైర్యo, మనోధైర్యం, మనోనిబ్బరం పెంపొందించే చర్యలు తీసుకోవాలి. కానీ, నిజాలు చెబితే సస్పెండ్ చేయడం మంచిది కాదు. వెంటనే ఆ డాక్టర్ ని డ్యూటీలో చేర్చుకోవాలి. డాక్టర్లకు అన్ని సదుపాయాలు సమకూర్చాలి’ అని డిమాండ్ చేస్తూ ఆయన ఓ ట్వీట్ చేశారు.