లాక్‌డౌన్ ను ఉల్లంఘించి పెళ్లి.. వధూవరుల అరెస్ట్
- పెళ్లికి వచ్చిన యాభై మందికి పైగా అతిథులు
- దక్షిణాఫ్రికాలో ఘటన.. ఫొటోలు వైరల్
- ఆ దేశంలో 1700 మందికి కరోనా పాజిటివ్
కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలన్నీ అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ప్రజలు సామాజిక దూరం పాటించేలా లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా కొంత మంది నిబంధనలను పట్టించుకోవడం లేదు. అలాంటి వాళ్లు కటకటాల వెనక్కి వెళ్తున్నారు. అలా లాక్‌డౌన్ రూల్స్‌ను ఉల్లంఘించినందుకు పెళ్లి జంటతో పాటు వివాహానికి హాజరైన అతిథులు అరెస్టయ్యారు. పెళ్లి జంట పోలీసు వాహనాల్లోకి ఎక్కుతున్న ఫొటోలు వైరల్ గా మారాయి. ఈ ఘటన దక్షిణాఫ్రికాలో జరిగింది.
స్థానిక వార్తా సంస్థ కథనం ప్రకారం.. 48 ఏళ్ల జబులాని జులు అనే వ్యక్తి నొమ్తాండాజొ మెక్ జీ (38)ని ఆదివారం వివాహం చేసుకున్నాడు. క్వాజులు- నటాల్ అనే ప్రాంతంలో ఈ పెళ్లి జరిగింది. అయితే కరోనా నేపథ్యంలో ప్రజలు గుమికూడడంపై అక్కడ నిషేధం ఉంది. అయినా.. జులు, మెక్ జీ పెళ్లి వేడుక జరుగుతున్న విషయం తెలియడంతో ఆయుధాలు ధరించిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
వేడుకను నిలిపివేసి వధూవరులతో పాటు పెళ్లికి వచ్చిన యాభై మందికి పైగా కుటుంబ సభ్యులు, అతిథులను అరెస్ట్ చేశారు. అందరినీ పోలీస్ స్టేషన్‌కు తరలించి.. ఒక్కొక్కరికి రూ. 4100 పూచికత్తుతో బెయిల్ ఇచ్చారు. కాగా, దక్షిణాఫ్రికాలో ఇప్పటిదాకా 1700 పైచిలుకు కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ దేశంలో ఈనెల 16 వ తేదీ వరకూ లాక్‌డౌన్ అమల్లో ఉండనుంది.