బాలీవుడ్ సినీ కార్మికులకు రూ. 3000 చొప్పున ట్రాన్స్ ఫర్ చేసిన సల్మాన్ ఖాన్

బాలీవుడ్ సినీ కార్మికులకు రూ. 3000 చొప్పున ట్రాన్స్ ఫర్ చేసిన సల్మాన్ ఖాన్
  • లాక్ డౌన్ నేపథ్యంలో రోజు వారీ సినీ కార్మికులకు  అండగా సల్మాన్
  • ఇచ్చిన మాట ప్రకారం ఆర్థికసాయం
  • కొంత కాలం తర్వాత మరికొంత బదిలీ
లాక్ డౌన్ నేపథ్యంలో బాలీవుడ్ కు చెందిన రోజు కూలీ సినీ కార్మికులు 25,000 వేల మందికి తాను అండగా ఉంటానని ప్రముఖ హీరో సల్మాన్ ఖాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం వారికి ఆర్థిక సాయం అందజేసే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఫెడరేషన్ వెస్ట్రన్ ఇండియన్ సినీ ఎంప్లాయీస్ (ఎఫ్ డబ్ల్యుఐసీఈ) అధ్యక్షుడు బీఎన్ తివారి తెలిపారు. రోజు కూలీ సినీ కార్మికులకు ఒక్కొక్కరికి రూ.3000 చొప్పున ఇచ్చే కార్యక్రమాన్ని సల్మాన్ ఖాన్ నిన్నటి నుంచి ప్రారంభించినట్టు చెప్పారు.

ఇప్పటి వరకు 23,000 మంది సినీ కార్మికులతో కూడిన జాబితాను సల్మాన్ కు అందజేశామని, దాని ప్రకారం ఆయా అకౌంట్లకు మూడు వేల రూపాయల చొప్పున మనీ ట్రాన్స్ ఫర్ చేశారని అన్నారు. కొంత కాలం తర్వాత మళ్లీ మరికొంత మొత్తాన్ని ఆయా వర్కర్లకు బదిలీ చేస్తారని చెబుతూ, సినీ కార్మికులకు అండగా నిలుస్తున్న సల్మాన్ కు ధన్యవాదాలు తెలియజేశారు.  


More Telugu News