ఇండియా చేసిన పని మీరు చేయగలరా?: ట్రంప్ కు శశిథరూర్ సూటి ప్రశ్న

  • అమెరికాకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఇవ్వనున్న భారత్
  • 29 మిలియన్ డోసుల పంపిణీకి అంగీకారం
  • వ్యాక్సిన్ తయారు చేస్తే భారత్ కు ఇస్తారా? అని ప్రశ్నించిన థరూర్
అమెరికాకు 29 మిలియన్ డోసుల హైడ్రాక్సీ క్లోరోక్విన్ డ్రగ్ ను అందించేందుకు భారత ప్రభుత్వం సంసిద్ధతను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విన్నపం మేరకు భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ కు కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ ఒక సూటి ప్రశ్నను వేశారు.

'మిస్టర్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్... మీరు కోరిన హైడ్రాక్సీ క్లోరోక్విన్ డ్రగ్ ను ఎలాంటి స్వార్థం లేకుండా మీకు అందించేందుకు భారత్ అంగీకరించింది. అమెరికా ప్రయోగశాలల్లో కరోనాకు ఏదైనా వ్యాక్సిన్ ను కనుక్కుంటే... దాన్ని అందరి కంటే ముందు భారత్ కు ఇచ్చేందుకు అనుమతిస్తారా?' అని ట్విట్టర్ ద్వారా శశిథరూర్ ప్రశ్నించారు.


More Telugu News