ఒక మాస్క్ ఇచ్చి పదిహేను రోజులు వాడమంటున్నారంటూ ఆరోపించిన వైద్యుడిపై సస్పెన్షన్ వేటు!
- విశాఖ జిల్లాలోని నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి వైద్యుడు సుధాకర్
- కనీస సౌకర్యాలు కూడా లేవని విమర్శలు
- . ఈ మేరకు రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషన్ ఉత్తర్వులు
విశాఖపట్టణం జిల్లాలోని నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేవని, డాక్టర్లకు ఒక మాస్క్ ఇచ్చి పదిహేను రోజులు వాడమంటున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన వైద్యుడు సుధాకర్ రావుపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు ఏపీ వైద్య విధాన పరిషత్ కమిషన్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ‘కరోనా’ సంక్షోభ సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం, 144 సెక్షన్ ఉల్లంఘన, ఉన్నతాధికారులను వ్యక్తిగతంగా దూషించడం వంటి నేరాల కింద కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది.