ఆర్కిటిక్ పై 10 లక్షల చదరపు కిలోమీటర్ల మేర ఓజోన్ పొరకు రంధ్రం!
- ఆర్కిటిక్ లో ఓజోన్ పొరకు రంధ్రాన్ని గుర్తించడం ఇదే తొలిసారి
- కోపర్నికస్ సెంటినెల్-5సీ శాటిలైట్ డేటా ఆధారంగా గుర్తింపు
- ఈ నెల మధ్యలోకల్లా రంధ్రం పూడిపోయే అవకాశం
ఉత్తర ధ్రువంలో ఉన్న ఆర్కిటిక్ పై ఓజోన్ పొరకు భారీ రంధ్రం పడినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. దాని వైశాల్యం ఏకంగా 10 లక్షల చదరపు కిలోమీటర్లని తెలిపారు. శాస్త్రవేత్తలు, పర్యావరణ ప్రేమికులు ఈ అంశంలో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దక్షిణ ధ్రువంలో ఉన్న అంటార్కిటిక్ పైన ఓజోన్ కు రంధ్రం ఎప్పటి నుంచో ఉంది. కానీ ఆర్కిటిక్ లో రంధ్రాన్ని గుర్తించడం ఇదే తొలిసారి. అది కూడా రంధ్రం వైశాల్యం భారీగా ఉండటం ఆందోళనను మరింత పెంచుతోంది.
జర్మన్ ఏరో స్పేస్ సెంటర్ కు చెందిన కోపర్నికస్ సెంటినెల్-5సీ శాటిలైట్ పంపిన డేటా ఆధారంగా ఉత్తర ధ్రువంలో ఓజోన్ పొర తరిగిపోతోందనే విషయాన్ని కనిపెట్టారు. ఈ సందర్భంగా జర్మన్ ఏరో స్పేస్ సెంటర్ కు చెందిన ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ, ఈ నెల మధ్యలోకల్లా రంధ్రం పూడిపోయే అవకాశం ఉందని చెప్పారు. అంటార్కిటిక్ తో పోలిస్తే ఈ రంధ్రం చిన్నదేనని అన్నారు.