కరోనా భయంతో చేతులతో పాటు... కరెన్సీ నోట్లను కూడా సబ్బుతో కడిగేస్తున్నారు!
- నోట్లను సబ్బు నీటితో శుభ్రపరుస్తున్న కర్ణాటకలోని ఓ గ్రామ ప్రజలు
- పంట అమ్మగా వచ్చిన డబ్బును శుభ్రపరుస్తున్నామని వ్యాఖ్య
- భయంతోనే ఇలా చేస్తున్నారన్న అధికారులు
కరోనా రక్కసి అంతకంతకూ విస్తరిస్తుండటంతో జనాలు హడలిపోతున్నారు. తాము కరోనా బారిన పడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో, ఓ వ్యక్తి రూ. 500 నోటుతో ముక్కు తుడుచుకున్న ఒక వీడియో జనాల్లో తీవ్ర ఆందోళనను కలిగించింది. దీంతో, కర్ణాటక మండ్య జిల్లాలోని మరనచకనహల్లి గ్రామస్తులు కరెన్సీ నోట్లను కూడా శుభ్రం చేసుకుంటున్నారు. 100, 500, 2000 విలువైన నోట్లను సబ్బు నీటితో కడిగి ఆరబెడుతున్నారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, పంట అమ్మగా వచ్చిన డబ్బును ఈ విధంగా శుభ్రం చేస్తున్నామని చెప్పారు. దీని వల్ల వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని తెలిపారు. దీనిపై అధికారులు స్పందిస్తూ... భయంతోనే వారు ఇలా చేస్తున్నారని... ఇది ఆహ్వానించదగ్గ విషయం కాదని చెప్పారు. సబ్బుతో కడగడం వల్ల నోట్లు పాడవుతాయని తెలిపారు.