ఆరోగ్య సర్వేకు వెళ్లిన ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలపై దాడి యత్నం
- ఓ ఇంటికి వెళ్లి వివరాల కోసం ఆరా
- మీకెందుకు చెప్పాలంటూ ఎదురు తిరిగిన నివాసితులు
- బాధితుల ఫిర్యాదుతో ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఆరోగ్య సర్వే నిర్వహిస్తున్న వైద్య సిబ్బందిపై ఓ ఇంట్లో నివాసితులు దాడికి ప్రయత్నించిన ఘటన వికారాబాద్ జిల్లా తాండూరులో చోటు చేసుకుంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని బాధ్యులైన ఇద్దరిని అరెస్టు చేశారు.
పోలీసుల కథనం మేరకు....పాతతాండూరు ప్రాంతంలోని కలాల్ గల్లీలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. ఆ ఇంట్లో వారి ఆరోగ్య వివరాలు తెలుసుకునేందుకు ఏఎన్‌ఎం అంజిమ్మ, ఆశా కార్యకర్త అరుణ వారింటికి వెళ్లారు. వివరాల కోసం అడుగగా మీకెందుకు చెప్పాలంటూ ఇంట్లో ఉంటున్న యాసిన్ అహ్మద్‌ఖాన్, నజీర్ అహ్మద్‌ఖాన్ దాడికి యత్నించారు.
దీంతో భయపడిన వైద్య సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో వారు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. దాడి యత్నం నిజమేనని తేలడంతో కేసు నమోదుచేసి నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ రవికుమార్ తెలిపారు.