కరోనా ప్రభావంతో చైనా కుబేరుల పంట పండింది!

  • టాప్-100లో చైనా కుబేరులు
  • ప్రపంచవ్యాప్తంగా 9 మంది బిలియనీర్ల సంపదలో పెరుగుదల
  • ఆ 9 మంది చైనీయులే!
కరోనా వైరస్ కారణంగా జనజీవనం అస్తవ్యస్తం కావడంతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఏ దేశంలోనూ ఆర్థిక స్థిరత్వం కనిపించని పరిస్థితి ఉత్పన్నమైంది. ఎక్కడికక్కడ లాక్ డౌన్ లు కొనసాగుతుండడంతో ఆర్థిక మందగమనం కొనసాగుతోంది. అటు, భారత్ లో కుబేరులు సైతం భారీగా నష్టపోవడం ఒక్క కరోనా వల్లే సాధ్యమైంది. ముఖేశ్ అంబానీ (1.44 లక్షల కోట్ల నష్టం), శివ్ నాడార్ (26 శాతం సంపద కోల్పోయారు), గౌతమ్ అదానీ (37 శాతం నష్టం) తమ నికర సంపదలో చాలాభాగం కోల్పోయారు. చైనా మినహా ప్రపంచవ్యాప్తంగా ఇదే ట్రెండ్ నెలకొంది.

చైనాలో మాత్రం ఆశ్చర్యకరంగా అనేకమంది బిలియనీర్లు వరల్డ్ టాప్-100 జాబితాలో చోటు సంపాదించారు. గత రెండు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 9 మంది బిలియనీర్ల సంపదలో భారీ పెరుగుదల కనిపించింది. ఆశ్చర్యకరంగా వారందరూ చైనీయులే. వారిలో కిన్ ఇంగ్లిన్ (పంది మాంసం ఉత్పత్తిదారుడు), లియూ యాంగ్హో (న్యూహోప్ గ్రూప్), అలెక్స్ జూ హాంగ్ (మెడికల్ ఎక్విప్ మెంట్), ఎరిక్ యువాన్ (జూమ్ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్), లీ యాంగ్జిన్ తదితరులున్నారు. చైనాలో కరోనా పరిస్థితులు వీరి వ్యాపారాలకు ఇతోధికంగా తోడ్పడ్డాయి.


More Telugu News