ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను కొనసాగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

  • ఏబీ వెంకటేశ్వరరావును విధుల నుంచి తొలగించిన సర్కారు
  • క్యాట్ ను ఆశ్రయించిన వెంకటేశ్వరరావు
  • పిటిషన్ కొట్టివేసిన క్యాట్
  • ఆగస్టు 5 వరకు సస్పెన్షన్ కొనసాగింపు
సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించారంటూ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ సర్కారు తొలగించిన సంగతి తెలిసిందే. తన సస్పెన్షన్ పై ఆయన కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్  (క్యాట్) ను ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. ఆయన పిటిషన్ ను క్యాట్ కొట్టివేసింది.

తాజాగా, ఏపీ సర్కారు ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఆయన సస్పెన్షన్ ను ఆగస్టు 5 వరకు కొనసాగిస్తున్నట్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏసీబీ ఇచ్చిన నివేదికపై ప్రభుత్వ కమిటీ సిఫారసుల మేరకు సస్పెన్షన్ కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా వ్యవహరించిన ఏబీ వెంకటేశ్వరరావును ఇప్పటి ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. భద్రతా పరికరాల కొనుగోలులో అతిక్రమణలు జరిగాయంటూ ఆయనపై ఆరోపణలు వచ్చాయి.


More Telugu News