గుంటూరులో కొత్తగా 8 పాజిటివ్ కేసులు.. కొన్ని ప్రాంతాలు రెడ్ జోన్లుగా గుర్తింపు

  • ఇప్పటి వరకు 41 కేసులు నమోదు అయ్యాయి
  • అందులో 27 కేసులు గుంటూరులోనే
  • రెడ్ జోన్లుగా మంగళదాస్ నగర్, కుమ్మరి బజార్ తదితర ప్రాంతాలు
గుంటూరు జిల్లాలో  కొత్తగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 8 నమోదైనట్టు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 41 కేసులు నమోదు అయ్యాయని, అందులో 27 కేసులు గుంటూరులోనే నమోదైనట్టు చెప్పారు. గుంటూరులోని మంగళదాస్ నగర్, కుమ్మరి బజార్, ఆనందపేట, బుచ్చయ్యతోట, నల్లచెరువు, సంగడిగుంట, శ్రీనివాసరావుతోట, ఆటోనగర్, ఎల్బీనగర్, కొరిటపాడు ప్రాంతాలను రెడ్ జోన్లుగా గుర్తించామని చెప్పారు. రెడ్ జోన్లుగా గుర్తించిన ప్రాంతాల్లో ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు రాకూడదని హెచ్చరించారు.

ఢిల్లీ వెళ్లొచ్చిన వారిని కలిసిన వారు, ‘కరోనా’ లక్షణాలు ఉన్న వారు పరీక్షల నిమిత్తం ముందుకు రావాలని సూచించారు. ఆర్ఎంపీ వైద్యులు తమ క్లినిక్ లను మూసివేయాలని ఆదేశించారు. ప్రైవేట్ ఆసుపత్రులకు  అనుమానితులు వస్తే నోటిఫై చేయాలని చెప్పారు. నిత్యావసరాల కొనుగోలు చేసే సమయాన్ని ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు కుదించామని తెలిపారు.


More Telugu News