కరోనా రోగులకు చికిత్స చేస్తున్న వైద్య సిబ్బందికి క్లోరోక్విన్ మాత్రలు
- ఎయిమ్స్ కీలక నిర్ణయం
- తగినన్ని క్లోరోక్విన్ మాత్రలు దగ్గర ఉంచుకోవాలని వైద్యసిబ్బందికి స్పష్టీకరణ
- కరోనా చికిత్సలో కీలకంగా మారిన హైడ్రాక్సీ క్లోరోక్విన్
ప్రాణాంతక కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. పసిఫిక్ మహాసముద్రంలోని కొన్ని దీవులను మినహాయిస్తే ప్రతిదేశంలోనూ ఈ మహమ్మారి తిష్టవేసింది. నిత్యం వేల సంఖ్యలో ప్రజలు కరోనా బారినపడుతున్నారు. భారత్ లోనూ దీని ప్రభావం గణనీయంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ప్రఖ్యాత ఎయిమ్స్ వైద్య సంస్థ కరోనా రోగుల చికిత్సలో పాలుపంచుకుంటున్న డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్యసిబ్బంది క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక ఆదేశాలు జారీచేసింది.
డాక్టర్లు, నర్సులు, తదితరులు హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను తగినంతగా దగ్గర ఉంచుకోవాలని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఆసుపత్రి స్టోర్ నుంచి హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు తీసుకోని అనేక విభాగాలకు చెందిన వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది ఇప్పుడు తమకు ఎన్ని మాత్రలు కావాలో ప్రతిపాదనలు పంపాలని ఓ ప్రకటనలో సూచించింది. ఈ మేరకు ఎయిమ్స్ సూపరింటిండెంట్ ఉత్తర్వులు జారీ చేశారు.
మలేరియా చికిత్సలో ప్రాణాధారమైన హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఔషధం ప్రస్తుతం కరోనా చికిత్సలోనూ కీలకంగా మారింది. దాంతో అగ్రరాజ్యం అమెరికా వంటి దేశాలు సైతం భారీగా డిమాండ్ చేస్తున్నాయి.