పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టు వస్తున్న వార్తలపై పూజ హెగ్డే స్పందన

  • రోహన్ మెహ్రాతో పూజ ప్రేమలో ఉందంటూ వార్తలు
  • తామిద్దరం మంచి స్నేహితులం అని చెప్పిన ముద్దుగుమ్మ 
  • కొందరు పుకార్లను పుట్టించారని మండిపాటు
టాలీవుడ్ లో వరుస సినిమాలతో పూజ హెగ్డే దూసుకుపోతోంది. అటు బాలీవుడ్ లో కూడా సత్తా చాటుతోంది. తాజాగా పూజాపై ఓ వార్త గత కొన్ని రోజులుగా వైరల్ అవుతోంది. అలనాటి బాలీవుడ్ స్టార్ వినోద్ మెహ్రా కొడుకు రోహన్ మెహ్రాతో ఆమె పీకల్లోతు ప్రేమలో ఉందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ క్రమంలో దీనిపై పూజ తాజాగా స్పందించింది. తమ మధ్య అలాంటిదేమీ లేదని... తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని చెప్పింది. తనతో రోహన్ ఉన్నప్పుడు కొంతమంది ఫొటోలు తీసి వైరల్ చేశారని... పుకార్లను పుట్టించారని తెలిపింది. ఈ వార్తలకు ఇప్పటికైనా ముగింపు పలకాలని కోరింది.


More Telugu News