కరోనాపై పోరాటానికి గవాస్కర్ రూ. 59 లక్షల విరాళం
- పీఎం కేర్స్ ఫండ్‌కు రూ. 35 లక్షలు
- మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 24 లక్షల సాయం
- తన వంతు సాయం చేసిన చటేశ్వర్ పుజారా
కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా దేశం చేస్తున్న పోరాటంలో భాగం కావడానికి అనేక మంది ముందుకొస్తున్నారు. ఈ జాబితాలో భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్, టీమిండియా టెస్టు ప్లేయర్ చటేశ్వర్ పుజారా కూడా చేరారు. కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వానికి గవాస్కర్ రూ. 59 లక్షలు విరాళంగా ప్రకటించినట్టు అతని సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. పీఎం కేర్స్ ఫండ్‌కు రూ. 35 లక్షలు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 24 లక్షలు సన్నీ అందించారని ముంబై రంజీ టీమ్ మాజీ కెప్టెన్ అమోల్ మజుందార్ ట్వీట్ చేశాడు.
చటేశ్వర్ పుజారా కూడా పీఎం కేర్స్ ఫండ్, గుజరాత్ ముఖ్యమంత్రి సహాయ నిధికి తన వంతు సాయం చేసినట్టు తెలిపాడు. అయితే, ఎంత విరాళం ఇచ్చిందీ అతను బహిర్గతం చేయలేదు. ‘పీఎం కేర్స్ ఫండ్, సీఎం రిలీఫ్ ఫండ్‌కు మా కుటుంబం, నేను సాయం చేశాం. మీరు కూడా చేస్తారని ఆశిస్తున్నా. ఈ కష్టకాలంలో ప్రతి చిన్న సాయం కూడా లెక్కలోకి వస్తుంది. ఈ సందర్భంగా వైరస్‌పై ముందుండి పోరాడుతున్న యోధులు.. వైద్య సిబ్బంది, పోలీసులు, నిత్యావసరాలు అందిస్తున్న ఉద్యోగులకు మా ధన్యవాదాలు’ అని పుజారా ట్వీట్ చేశాడు.