రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరితే ఎమ్మెల్యేను అరెస్ట్ చేస్తారా?: గవర్నర్ కు చంద్రబాబు లేఖ
- నిమ్మల రామానాయుడుని అడ్డుకున్న పోలీసులు
- గవర్నర్ కు ఫిర్యాదు చేసిన చంద్రబాబు
- ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని గవర్నర్ కు విజ్ఞప్తి
టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుని నిన్న పోలీసులు అరెస్ట్ చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు లేఖ రాశారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరితే ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారంటూ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఫోన్ లో కలెక్టర్ స్పందించకపోవడంతో నేరుగా వినతి పత్రం ఇవ్వాలని ఎమ్మెల్యే రామానాయుడు నిర్ణయించుకున్నారని, కానీ భీమవరం వద్ద పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు.
వైసీపీ ఎమ్మెల్యేలు వందల మందితో సమావేశాలు నిర్వహించారని, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తన లేఖలో ఆరోపించారు. మంత్రి, కలెక్టర్ 200 మందితో సమావేశం నిర్వహిస్తే చర్యల్లేవని విమర్శించారు. రైతుల సమస్యల పరిష్కారానికి జోక్యం చేసుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా వ్యవహరించాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు పాలకొల్లు నుంచి ఏలూరుకు సైకిల్ యాత్ర చేపట్టగా, పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. దాంతో టీడీపీ ఎమ్మెల్యేకి, పోలీసులకు మధ్య వాగ్వివాదం రేగింది.