మూడు రాష్ట్రాలలో వేగంగా పెరుగుతున్న కరోనా!

  • మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీలో తీవ్ర ప్రభావం
  • ఏప్రిల్‌లో భారీగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు
  • నిన్నటికి దేశంలో 4281 మంది బాధితులు
కరోనా మహమ్మారిని ఎదుర్కొనే విషయంలో మనదేశంలో ప్రస్తుతం ఆరోగ్య అత్యవసర పరిస్థితి కనిపిస్తోంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో రోజూ పదుల సంఖ్యలో కొత్త కేసులు రావడం ఆందోళన కలిగిస్తోంది. వైరస్ ఇంకా మూడో దశ (కమ్యూనిటీ ట్రాన్స్‌ మిషన్‌)కు రాకపోయినా గత వారం రోజుల నుంచి భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు వస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీలో వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది.

ఇండియాలో మార్చి 10 నుంచి 20 మధ్య పది రోజుల్లో కరోనా సోకిన వారి సంఖ్య 50 నుంచి 196కు చేరుకుంది. మార్చి చివరికి అది 1397కు పెరిగింది. ఏప్రిల్ ఆరో తేదీ నాటికి కరోనా పాజిటివ్ కేసులు 4281కి చేరాయి. అంటే గడచిన ఐదు రోజుల్లో వైరస్ వ్యాప్తి ఎలా పెరిగిందో చెప్పొచ్చు. ఈ కాలంలో కొత్తగా వచ్చిన కేసులు మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ నుంచే ఎక్కుగా ఉన్నాయి. ఈ మూడు రాష్ట్రాలు దేశంలో కొవిడ్-19కు హాట్ స్పాట్స్ గా కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా నమోదైన కేసుల్లో ఈ మూడు రాష్ట్రాల వాటా 43 శాతం ఉండడం గమనార్హం. ప్రస్తుతం మహారాష్ట్రలో 748, తమిళనాడులో 621, ఢిల్లీలో 523 పాజిటివ్ కేసులు ఉన్నాయి.


More Telugu News