నేను కూడా ఇందులో భాగమైనందుకు సంతోషంగా ఉంది: 'ఫ్యామిలీ' షార్ట్ ఫిలింపై చిరంజీవి
- అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రధారిగా ఫ్యామిలీ షార్ట్ ఫిలిం
- తమ ఇళ్లలోనే ఉండి నటించిన సూపర్ స్టార్లు
- లక్ష మంది సినీ కార్మికులకు ఉపకరిస్తుందన్న మెగాస్టార్
బాలీవుడ్ స్టార్ ఫిలింమేకర్ కరణ్ జొహార్ దేశంలోని అందరు స్టార్లతో 'ఫ్యామిలీ' అనే షార్ట్ ఫిలింను రూపొందించిన సంగతి తెలిసిందే. కరోనా సహాయక చర్యలకు నిధుల సేకరణ ఉద్దేశంతో ఈ షార్ట్ ఫిలింను నిర్మించారు. సోనీ టీవీ చానల్లో విడుదలైన ఫ్యామిలీకి విశేష స్పందన వస్తోంది. ఇందులో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, చిరంజీవి తదితరులు తమ ఇళ్లలోనే ఉండి నటించారు.
దీనిపై చిరంజీవి స్పందించారు. ఈ అద్భుతమైన కార్యాచరణలో తాను కూడా భాగం అయ్యానని, అందుకు ఎంతో సంతోషిస్తున్నానని పేర్కొన్నారు. ఈ షార్ట్ ఫిలిం ద్వారా వచ్చే ఆదాయం భారత సినీ పరిశ్రమకు చెందిన లక్ష మంది సినీ కార్మికులకు ఊరట కలిగిస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సోనీ పిక్చర్స్ నెట్ వర్క్ ఇండియా, కల్యాణ్ జ్యుయెల్లర్స్ కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు ట్వీట్ చేశారు.