పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంచిన హీరో గోపీచంద్
- వెయ్యి కుటుంబాలకు నెలకు సరిపడే నిత్యావసరాల పంపణీ
- స్వయంగా అందజేసిన తెలుగు నటుడు
- ఇప్పటికే తెలంగాణ, ఏపీ సీఎంల రిలీఫ్ ఫండ్ కు విరాళం
కరోనా వైరస్ పై పోరాటానికి ప్రభుత్వానికి పలువురు అండగా నిలుస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. రాజకీయ, క్రీడా, సినీ ప్రముఖులు వారికి తమ వంతు సాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు హీరో గోపీచంద్ పెద్ద మనసు చాటుకున్నారు. వెయ్యికి పైగా పేద కుటుంబాలకు ఒక నెలకు సరిపడే నిత్యావసర వస్తువులను అందించారు. గోపీచంద్ ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు విరాళాన్ని ప్రకటించారు. ఇప్పుడు పేదల ఆకలి తీర్చేందుకు స్వయంగా సరుకులు అందించిన గోపీచంద్‌ను పలువురు మెచ్చుకుంటున్నారు.