కరోనా మహమ్మారి సవాళ్లను వివరిస్తూ, కన్నీరు పెట్టుకున్న ఎయిమ్స్ డాక్టర్ అంబిక... వీడియో వైరల్!
- కరోనా వార్డులో పని చేస్తున్న అంబిక
- అనుక్షణం సవాళ్లు ఎదురవుతున్నాయి
- కుటుంబ సభ్యుల సపోర్ట్ ముఖ్యమంటూ భావోద్వేగం
న్యూఢిల్లీలోని ఎయిమ్స్ లో వైద్యురాలిగా పనిచేస్తూ, ప్రస్తుతం కరోనా పాజిటివ్ పేషంట్ల వార్డులో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ అంబిక, కరోనా మహమ్మారి మానవాళి ముందుంచిన సవాళ్ల గురించి వివరిస్తూ, కన్నీరు పెట్టుకోగా, ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రస్తుతం విశ్రాంతి లేకుండా పగలనకా, రాత్రనకా, బాధితులకు చికిత్స చేస్తున్న ఆమె, కుటుంబానికి దూరంగా ఉన్నారు.
తన పరిస్థితిపై మీడియాతో మాట్లాడిన ఆమె, "ఇది అనుక్షణం సవాళ్లను ఎదురుగా ఉంచుతున్న సమయం. రోజురోజుకూ వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో కుటుంబ సభ్యుల నుంచి మాకు మద్దతు అవసరం ఎంతైనా ఉంది" అంటూ భావోద్వేగానికి గురయ్యారు.
తమ కుటుంబంలో ఎవరైనా అనారోగ్యానికి గురై, వారికి స్వయంగా చికిత్సను అందించలేకుంటే, ఆ బాధ జీవితాంతమూ ఉంటుందని అంబిక వ్యాఖ్యానించారు. తాము ప్రజలకు చికిత్సను అందించేందుకే ఉన్నామని, ఇక్కడి సహచరులు, స్నేహితులు, ఆసుపత్రి స్టాఫ్ నుంచి మద్దతు లభిస్తోందని, ఇదే సమయంలో కుటుంబం నుంచి వచ్చే సపోర్ట్ అత్యంత కీలకమని ఆమె వ్యాఖ్యానించారు. డాక్టర్ అంబిక మాట్లాడిన మాటల వీడియో వైరల్ అవుతోంది.