ఫేక్ వీడియో పోస్ట్ చేసిన కిరణ్ బేడీ... నెటిజన్ల విమర్శల వర్షం!
- కరోనా భయంతో గుడ్లను పారేస్తున్నారు
- వాటి నుంచి పిల్లలు వస్తాయంటూ వీడియో పెట్టిన కిరణ్ బేడీ
- తినే గుడ్ల నుంచి పిల్లలెలా వస్తాయని ప్రశ్నిస్తున్న నెటిజన్లు
కరోనా మహమ్మారి విస్తరిస్తున్న వేళ, సోషల్ మీడియాలో నకిలీ వీడియోలు పోస్ట్ చేస్తుంటే, వాటిని నమ్ముతున్న వారెందరో ఉన్నారు. వారి కారణంగా తప్పుడు వార్తలు మరింతగా ప్రజల్లో విస్తరిస్తున్నాయి. తాజాగా ఓ ఫేక్ వీడియోను గుడ్డిగా నమ్మి, దాన్ని ఫార్వార్డ్ చేసిన వారిలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ చేరిపోగా, నెటిజన్లు విమర్శల వర్షం కురిపించారు.
ఇంతకీ ఏం జరిగిందంటే, ఎవరి నుంచో తనకు వచ్చిన కోడిపిల్లల వీడియోను కిరణ్ బేడీ షేర్ చేశారు. ఓ చోట గుంపులుగా కోడిపిల్లలు తిరుగుతూ ఉండగా, "కోడిగుడ్డు వల్ల కరోనా వ్యాపిస్తుందన్న భయంతో మనం వాటిని పారేస్తున్నాం. అయితే, అవి ఓ వారం తరువాత ఇలా కోడిపిల్లలుగా మారతాయి. ఇదే సృష్టి స్వభావం. ప్రతి జీవితానికీ దాని సొంత మార్గం ఉంటుంది" అని వ్యాఖ్యానించారు.
ఇక, ప్రజలు తినే, పారేసే గుడ్లు ఎలా కోడిపిల్లలుగా మారతాయని నెటిజన్లు ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఏదైనా పోస్ట్ చేసేముందు, షేర్ చేసేముందు సరిచూసుకోవాలని సూచిస్తున్నారు.