బాయ్ ఫ్రెండ్ దగ్గరికి పంపాలంటూ, హైదరాబాద్ పోలీసుల వద్ద యువతి పంచాయితీ!
- లాక్ డౌన్ అమలవుతున్న వేళ విచిత్ర కేసు
- బంజారాహిల్స్ యువతిని కలిసిన యువకుడు
- యువకుడిపై కేసు పెట్టిన యువతి తల్లిదండ్రులు
- తనకు అతను కావాల్సిందేనని వచ్చిన యువతి
ఓ వైపు కరోనా వ్యాప్తి నిరోధానికి లాక్ డౌన్ అమలు చేస్తున్న వేళ, హైదరాబాద్ పోలీసుల ముందుకు ఓ విచిత్రమైన కేసు రాగా, ఏం చేయాలో తెలియక పోలీసులు తల పట్టుకున్నారు. తనకు బాయ్ ఫ్రెండ్ ను చూడాలని ఉందని, అతని వద్దకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఓ యువతి బంజారాహిల్స్ పోలీసుల వద్దకు వచ్చింది.
వివరాల్లోకి వెళితే, అంబర్ పేటకు చెందిన ఓ యువకుడు, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో నివాసం ఉంటున్న ఓ యువతి ప్రేమించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం నాడు సదరు యువకుడు, ఆమె వద్దకు రాగా, చుట్టుపక్కల వారు పట్టుకుని, యువతి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు తమ బిడ్డను యువకుడు వేధిస్తున్నాడంటూ, పోలీసు కేసు పెట్టారు. పోలీసులు అతన్ని విచారించగా, ఆమెపై తనకు ప్రేమ లేదని, ఆ విషయాన్ని స్పష్టం చేసేందుకే వచ్చానని చెప్పి తప్పించుకున్నాడు. దీంతో అతన్ని హెచ్చరించిన పోలీసులు పంపించి వేశారు.
ఆ తరువాత అతని ప్రియురాలు పోలీసుల వద్దకు వచ్చింది. తాను యువకుడిని కలవాల్సిందేనని భీష్మించుకుని కూర్చుంది. తనకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, స్టేషన్ లోనే బైఠాయించింది. ఉన్నతాధికారులు, ఆమెకు లాక్ డౌన్ నిబంధనల గురించి వివరించి, ఈ తరహా ప్రవర్తన కూడదని సర్ది చెప్పి పంపించారు.