కన్నడ సినీ కమెడియన్ ‘బుల్లెట్’ ప్రకాశ్ అనారోగ్యంతో మృతి
- లివర్ ఇన్ఫెక్షన్, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడ్డ ప్రకాశ్
- బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
- కన్నడ, తమిళ, ఇతర భాషల్లో 325 కు పైగా చిత్రాల్లో నటన
గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కన్నడ సినీ రంగానికి చెందిన ప్రముఖ కమెడియన్ ‘బుల్లెట్’ ప్రకాశ్ (42) మృతి చెందాడు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ సాయంత్రం ఆయన కన్నుమూశాడు. లివర్ ఇన్ఫెక్షన్, కిడ్నీ సంబంధిత, జీర్ణ కోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న బుల్లెట్ ప్రకాశ్ ని మార్చి 31న ఆసుపత్రిలో చేర్చారు.
వైద్యులు చికిత్స అందిస్తున్నప్పటికీ కోలుకోలేకపోయాడు. శ్వాస తీసుకోవడం కూడా కష్టం కావడంతో ఆయనకు వెంటిలేటర్ల సాయంతో శ్వాసను అందించారని, 35 కిలోల వరకు బరువు కూడా తగ్గిపోయాడని ప్రకాశ్ సన్నిహితుల సమాచారం. కాగా, ప్రకాశ్ మృతిపై కన్నడ చిత్ర పరిశ్రమ తమ సానుభూతి తెలిపింది. కన్నడ, తమిళం, ఇతర భాషలు సహా 325 కు పైగా చిత్రాల్లో ప్రకాశ్ నటించాడు.