కరోనాపై మరికొంతకాలం పోరాడాల్సి ఉంటుంది: మోదీ

  • ఇది సుదీర్ఘమైన పోరు అవుతుందన్న ప్రధాని
  • కరోనాపై పోరులో వెనక్కి తగ్గవద్దని పిలుపు
  • ప్రపంచ దేశాలకు భారత్ ఆదర్శంగా నిలుస్తుందని వ్యాఖ్యలు
ఏప్రిల్ 14తో లాక్ డౌన్ ముగియనున్న నేపథ్యంలో, ఆ మరుసటి రోజు నుంచి ఆంక్షలు తొలగిపోతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ప్రధాని నరేంద్ర మోదీ మాటలు మరోలా ఉన్నాయి. కరోనా మహమ్మారిపై భారత్ సాగిస్తున్న పోరాటానికి సుదీర్ఘ సమయం పట్టొచ్చని అభిప్రాయపడ్డారు.

కరోనాపై పోరులో అలసిపోవద్దని, ఓటమిని తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ వైరస్ భూతంపై పోరులో దేశం జయభేరి మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కరోనాపై భారత్ చేస్తున్న యుద్ధం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. బీజేపీ 40వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.


More Telugu News