నిర్మాత రామ్ తాళ్లూరికి అంతర్జాతీయ గుర్తింపు.. పవన్ అభినందనలు

  • ఈ శతాబ్దపు అద్భుత ఆవిష్కర్తల్లో ఒకరు రామ్ తాళ్లూరి
  • '21వ శతాబ్దపు అద్భుత ఆవిష్కర్తలు' పుస్తకంలో రామ్ గురించి వివరణ
  • తెలుగు రాష్ట్రాలకు సేవలందిస్తున్నారంటూ పవన్ స్పందన
ఐటీ వ్యాపారవేత్త, నిర్మాత రామ్ తాళ్లూరికి అరుదైన గౌరవం లభించింది. కేథలిన్ ట్రేసీ రచించిన '21వ శతాబ్దపు అద్భుత ఆవిష్కర్తలు' అనే పుస్తకంలో రామ్ తాళ్లూరి విజయప్రస్థానాన్ని పేర్కొన్నారు. ఈ పుస్తకంలో 15 మంది ఆవిష్కర్తల గురించి పేర్కొనగా వారిలో రామ్ తాళ్లూరి ఒకరు. 'లీడ్ ఐటీ' అనే సంస్థతో ఆయన అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు.

దీనిపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందిస్తూ, రామ్ తాళ్లూరికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నానని ట్వీట్ చేశారు. వ్యాపార దక్షతతోనే కాకుండా, సామాజిక స్ఫూర్తి పరంగానూ తెలుగు రాష్ట్రాలకు సేవలందిస్తున్నారని కొనియాడారు. పవన్ స్పందనకు రామ్ తాళ్లూరి ధన్యవాదాలు తెలిపారు. "మీ అభినందనలే నాకు దక్కిన అపురూప గౌరవంగా భావిస్తాను" అంటూ వినమ్రంగా బదులిచ్చారు. రామ్ తాళ్లూరి వ్యాపార రంగంలోనే కాదు, సినీ రంగంలోనూ నిర్మాతగా కొనసాగుతున్నారు. చుట్టాలబ్బాయి, డిస్కో రాజా చిత్రాలను నిర్మించారు.


More Telugu News