కన్నీరు పెట్టించే వీడియోలు పోస్ట్ చేసి.. మేనకా గాంధీకి 'జబర్దస్త్' యాంకర్ రష్మీ విజ్ఞప్తి
- పెంపుడు కుక్కలను కొందరు రోడ్డుపై వదిలేస్తున్నారు
- తిండి లేక చావు బతుకుల మధ్య పోరాడుతున్నాయి
- వాటిని పట్టించుకునే వారే కరవైపోయారు
- పెంపుడు కుక్కల విషయంలో నియమాలు అమలు చేయాలి
తాము పెంచుకుంటున్న కుక్కలను కొందరు కరోనా నేపథ్యంలో రోడ్డుపై వదిలేస్తున్నారు. దీంతో అవి తిండి లేక చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. వాటిని పట్టించుకునే వారే కరవైపోయారు. ఇందుకు సంబంధించి కన్నీరు పెట్టిస్తోన్న కొన్ని వీడియోలను జబర్దస్త్ యాంకర్ రష్మీ పోస్ట్ చేసింది. ఆకలితో అలమటిస్తూ, కదలలేక, తలెత్తికూడా చూడలేక మూలుగుతూ శునకాలు ఆ వీడియోల్లో ఉన్నాయి. వీటిని పోస్ట్ చేసి కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీకి రష్మీ ఓ విజ్ఞప్తి చేసింది.
కుక్కలను ఎవరూ వదిలేసుకోవద్దని రష్మీ చెప్పింది. కుక్కలను పెంచుకునేందుకు తీసుకున్న సమయంలో యజమానుల నుంచి హామీ తీసుకోవాలని రష్మీ సూచించింది. ఇందుకోసం పత్రాలపై సంతకాలు చేయించుకోవాలని చెప్పింది.
ఎట్టిపరిస్థితుల్లోనూ కుక్కలను వదలబోమని అందులో రాయించాలని కోరింది. ఒట్టి చేతులతో వెళ్లి కుక్కను కొని ఇంటికి తెచ్చుకునే విధానానికి స్వస్తి చెప్పాలని సూచించింది. కుక్కలను పెంచుకునే యజమానుల విషయంలో కఠిన నిబంధనలు అమలు చేయాల్సిన అవసరం ఉందని, ఇలా రోడ్లపై వదిలేసేలా చేయకుండా చర్యలు తీసుకోవాలని చెప్పింది.