మిమ్మల్ని బాణసంచా ఎవరు కాల్చమన్నారు?: మంచు మనోజ్ ఫైర్
- అగ్ని ప్రమాద వీడియోను పోస్ట్ చేసిన మనోజ్
- ఇలా చేయాలని వారిని ఎవరూ అడగలేదని వ్యాఖ్య
- దయచేసి మనుషుల్లా ప్రవర్తించండని హితవు
నిన్న రాత్రి 9గంటల నుంచి 9 నిమిషాల పాటు దీపాలు వెలిగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెబితే కొందరు బాణసంచా కాల్చారు. దీంతో పలు చోట్ల అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోను చూసిన టాలీవుడ్ హీరో మంచు మనోజ్ మండిపడ్డాడు. ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌ను మనోజ్ రీట్వీట్ చేశాడు. బాణసంచా కాల్చడం వలన తమ ఇంటి పక్కన భారీ అగ్ని ప్రమాదం జరిగిందని ఓ నెటిజన్ చెప్పాడు.
దీనిపై మనోజ్ స్పందిస్తూ.. 'కొందరు బాణసంచా కాల్చుతున్నారు. ఇలా చేయాలని వారిని ఎవరూ అడగలేదు.. దయచేసి మనుషుల్లా ప్రవర్తించండి' అని మనోజ్ ట్వీట్ చేశాడు. 'ఈ క్రాకర్స్ కాల్చడం చూస్తుంటే మన వాళ్లు కరోనాని కూడా సీఎంని లేక పీఎంని చేసేలా ఉన్నారు. తికమకపెడుతున్నారు.. జై కరోనా అని కూడా అంటున్నారు' అని ఎద్దేవా చేశాడు.