హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో కలకలం.. కరోనా బాధితుడు పరారైనట్లు గుర్తింపు

  • పోలీసులకు ఫిర్యాదు చేసిన వైద్యులు
  • గద్వాలకు చెందిన ఈ వ్యక్తికి కరోనా
  • వారం రోజు క్రితం ఇక్కడి ఐసోలేషన్‌ వార్డులో చేరిక
హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి నుంచి కరోనా బాధితుడు ఒకరు పరారయ్యారన్న సమాచారం స్థానికంగా కలకలానికి కారణమైంది. గద్వాలకు చెందిన ఈ వ్యక్తి కరోనా బారిన పడినట్లు గుర్తించడంతో వారం రోజుల క్రితం ఆసుపత్రికి తెచ్చి ఐసోలేషన్‌ వార్డులో ఉంచారు. అప్పటి నుంచి ఇక్కడ చికిత్స పొందుతున్న బాధితుడు వైద్య సిబ్బంది కళ్లుగప్పి పారిపోయినట్లు  నిన్నరాత్రి గుర్తించారు. ఈ సమాచారం ఆసుపత్రి వర్గాల్లో కలకలానికి కారణమైంది. వెంటనే తేరుకున్న ఆసుపత్రి వైద్యాధికారులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం బాధితుడి కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు.


More Telugu News