లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌...15 శాతం ఉద్యోగాల్లో కోత ఖాయం: సీఐఐ అంచనా

  • ఇది 30 శాతం వరకు ఉన్నా ఆశ్చర్యం లేదు
  • ఆయా సంస్థల ఆదాయం 10 శాతం తగ్గుదల
  • దీంతో తీవ్ర నిర్ణయాలు తీసుకునే అవకాశం
కరోనా వైరస్‌ కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న లాక్‌డౌన్‌ నిర్ణయం ఉద్యోగాలపై తీవ్రప్రభావం చూపనుందని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ) అంచనా వేసింది. గతవారం దాదాపు రెండు వందల మంది సీఈఓలతో మాట్లాడి, సర్వేచేసిన ఈ సంస్థ లాక్‌డౌన్‌ అనంతరం భారీగా ఉద్యోగాల కోత ఉంటుందని చెబుతోంది.

‘ఆయా కంపెనీల ఆదాయంలో పది శాతం వరకు క్షీణత ఉంటుంది. లాభాల్లో ఐదు శాతం వరకు క్షీణత తప్పదు. ఈ పరిస్థితుల్లో ఉద్యోగాల కోతకే ఆయా సంస్థలు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇది కచ్చితంగా 15 శాతం వరకు ఉంటుంది. అనివార్య పరిస్థితుల్లో 30 శాతం వరకు ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదు’ అంటూ ఆయా సీఈఓల మాటలను ఉటంకిస్తూ ఈ సంస్థ నిర్థారించింది.

ఈ సందర్భంగా సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ మాట్లాడుతూ ‘ఆకస్మికంగా విధించిన లాక్‌డౌన్‌ కారణంగా పరిశ్రమల కార్యకలాపాలు గణనీయంగా దెబ్బతిన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ పరిస్థితుల్లో ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించే అవకాశం ఉంది’ అన్నారు.


More Telugu News