అమెరికాలో అంతకంతకూ పెరుగుతున్న మరణాలు.. ప్రజలకు ట్రంప్ సూచన!
- నిన్న ఒక్క రోజే 1188 మంది మృత్యువాత
- పది వేలకు చేరువలో మరణాలు
- 95 శాతం మంది ఇంటికే పరిమితం కావాలన్న ట్రంప్
అమెరికాలో కరోనా మరణమృదంగం కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 1188 మంది మృత్యువాత పడ్డారు. మొత్తంగా 9,626 మంది ప్రాణాలు కోల్పోయారు. 9/11 ఉగ్రదాడిలో చనిపోయిన వారితో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. కొత్తగా 23 వేల మందిలో కరోనా లక్షణాలు గుర్తించారు. దీంతో అమెరికాలో మొత్తం కేసుల సంఖ్య 3,36,958కి పెరిగింది. మృతుల సంఖ్య పదివేలకు చేరువవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించాలని, 95 శాతం మంది ఇంటికే పరిమితం కావాలని పేర్కొన్నారు.
మరోవైపు, వైరస్ కట్టడి కోసం మాస్కులు, గ్లౌజులు, ఇతర రక్షణ పరమైన వస్తువులను దిగుమతి చేసుకునే ప్రక్రియను వేగవంతం చేసినట్టు ట్రంప్ తెలిపారు. వైరస్ అంతకంతకూ విజృంభిస్తున్న నేపథ్యంలో 50 రాష్ట్రాల్లో తాజా సంక్షోభాన్ని భారీ విపత్తుగా ప్రకటించారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఉపయోగం వల్ల ఫలితం ఉంటుందన్న ట్రంప్.. వివిధ దేశాల నుంచి 29 లక్షల డోసుల ఔషధాన్ని తెప్పించినట్టు తెలిపారు.