కొత్త సమస్య: నాలుగేళ్ల పులికి కరోనా.. జూ ఉద్యోగి నుంచి సోకిన వైరస్

  • న్యూయార్క్‌లోని బ్రోంక్స్ జూలో ఘటన
  • అనారోగ్యం పాలైన మరో ఆరు పులులు, సింహాలు
  • కొత్త సమస్య మొదలైందన్న జూపార్క్ డైరెక్టర్
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ తొలిసారి నాలుగేళ్ల పులికి సోకింది. అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిందీ ఘటన. అమెరికన్ ఫెడరల్ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. నగరంలోని బ్రోంక్స్ జూలో నాలుగేళ్ల పులి నాడియాకు జూపార్క్ ఉద్యోగి నుంచి వైరస్ సోకినట్టు తెలిపారు.

ఇదే జూలో ఉన్న మరో ఆరు పులులు, సింహాలు కూడా అనారోగ్యానికి గురయ్యాయి. ప్రస్తుతం నాడియా కోలుకుందని పేర్కొన్నారు. పులికి కరోనా సోకడంతో అప్రమత్తమైన అధికారులు గత నెల 16న జూను మూసివేశారు. జంతువుల్లోనూ వైరస్ ప్రబలడంతో కొత్త సమస్య తలెత్తినట్టు అయిందని జూపార్క్ డైరెక్టర్ జిమ్ బ్రెహేనీ తెలిపారు. ప్రస్తుతం నాడియాను ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇటీవల హాంకాంగ్‌లో రెండు శునకాలు కూడా వైరస్ బారిన పడినట్టు వార్తలు వచ్చాయి.

కన్ఫర్మేషన్ స్టేట్ మెంట్ ఇదిగో 



More Telugu News