ఆచూకీ లేని రిమాండ్ ఖైదీ.. నిందితుడి వద్ద పది రౌండ్ల షార్ట్ వెపన్!

  • నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన
  • ఎస్కార్ట్ కానిసేబుళ్లపై దాడి చేసి తుపాకితో పరారీ
  • బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించి గాలింపు
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి ఎస్కార్ట్ కానిస్టేబుళ్లపై దాడి చేసి షార్ట్‌వెపన్‌తో పరారైన రిమాండ్‌ ఖైదీ కోసం నిజామాబాద్ పోలీసులు గాలిస్తున్నారు. హత్య, హత్యాయత్నం, దోపిడీ, దొంగతనం వంటి కేసుల్లో నిందితుడైన జీలకర్ర ప్రసాద్‌ను అరెస్ట్ చేసిన మాక్లూరు పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అనారోగ్యం కారణంగా ఇటీవల అతడిని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కానిస్టేబుళ్లను ఎస్కార్ట్‌గా పెట్టారు. శనివారం రాత్రి కానిస్టేబుళ్లపై దాడిచేసిన నిందితుడు ప్రసాద్.. ఓ కానిస్టేబుల్ నుంచి తుపాకి లాక్కుని పరారయ్యాడు.

 అప్రమత్తమైన పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. మూడు రోజులుగా గాలిస్తున్నా అతడి ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. అతడి వద్ద ఉన్న తుపాకి(షార్ట్ వెపన్) లో పది రౌండ్లు ఉన్నట్టు సీపీ కార్తికేయ తెలిపారు. అతడి కోసం గాలిస్తున్న పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించినట్టు సీపీ పేర్కొన్నారు.


More Telugu News