మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానులకు మోదీ ఫోన్
- దేశంలో కొనసాగుతున్న లాక్ డౌన్
- కరోనా నివారణ చర్యలపై అభిప్రాయాలు తెలుసుకున్న ప్రధాని
- సోనియా, మమతలకు కూడా ఫోన్
దేశంలో ప్రస్తుతం లాక్ డౌన్ నడుస్తోంది. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్నాయి. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానమంత్రులకు ఫోన్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కరోనా వ్యాప్తి నివారణ, సహాయకచర్యలపై మోదీ వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. కరోనా విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు, సూచనలు స్వీకరించారు. మోదీ పలువురు రాజకీయనేతలతోనూ ఫోన్ లో మాట్లాడారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ములాయం సింగ్ యాదవ్ తదితరులతో కరోనా చర్యలపై మాట్లాడారు. ప్రభుత్వం పరంగా తీసుకుంటున్న చర్యలపై వారితో చర్చించారు.