గుర్తింపు కార్డులు లేని సినీ కార్మికులకు ‘జార్జిరెడ్డి’ చిత్ర యూనిట్ సాయం
- లాక్ డౌన్ నేపథ్యంలో పేద సినీ కార్మికులకు నిత్యావసరాల పంపిణీ
- 10 రోజులకు సరిపడా కందిపప్పు, నూనె, ఉల్లిపాయలు అందజేత:
- సామాజిక స్పృహతో వ్యవహరించాలి: నిర్మాత అన్నపురెడ్డి అప్పిరెడ్డి
ఉస్మానియా యూనివర్శిటీలో నాటి విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి జీవితం ఆధారంగా కొన్ని నెలల క్రితం విడుదలైన చిత్రం ‘జార్జిరెడ్డి’. లాక్ డౌన్ నేపథ్యంలో సినీ కార్మికులకు సాయంగా నిలిచే నిమిత్తం ఈ చిత్ర యూనిట్ ముందుకొచ్చింది. సినీ కార్మికులుగా పనిచేస్తున్నప్పటికీ గుర్తింపు కార్డులు లేని వారికి ఆసరాగా నిలుస్తూ వారి కుటుంబాలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు.
జార్జిరెడ్డి చిత్ర నిర్మాతలు అన్నపురెడ్డి అప్పిరెడ్డి, దామురెడ్డి, దర్శకుడు జీవన్ రెడ్డి తో పాటు ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషించిన సందీప్, ఇతర నటులు తదితరులు సినీ కార్మికులకు పదిరోజులకు సరిపడా నిత్యావసరాలు కందిపప్పు, నూనె, ఉల్లిపాయలు అందజేశారు. ఈ సందర్భంగా అన్నప్పురెడ్డి అప్పిరెడ్డి మాట్లాడుతూ, ఇలాంటి పరిస్థితుల్లో తోటి వారికి సాయం చేయాలని, సామాజిక స్పృహతో వ్యవహరించాలని అన్నారు.