క‌రోనా వచ్చిందేమోనని మూడో అంతస్తు నుంచి దూకేశాడు!

  • ఢిల్లీలో ఘటన
  • ఎయిమ్స్‌లో ఉంటోన్న వ్యక్తి
  • కాలు విరిగి ప్రాణాలతో బయటపడ్డ వైనం
కొందరిలో కరోనా వైరస్‌ భయం పెరిగిపోతోంది. ధైర్యంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నప్పటికీ చాలా మంది వణికిపోతున్నారు. తమకు కరోనా వచ్చిందేమోనన్న భయంతో కొందరు ఆత్మహత్యాయత్నం చేస్తుండడం కలకలం రేపుతోంది. ఢిల్లీలోని ఎయిమ్స్ లో జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ్ అపెక్స్ ట్రామా సెంట‌ర్‌లో ఓ వ్య‌క్తి త‌న‌కు క‌రోనా వ‌చ్చిందేమోన‌ని వణికిపోతూ ఎయిమ్స్ భ‌వంతిలోని మూడో అంత‌స్తు నుంచి కిందికి దూకాడు.

అత‌డి కాలు మాత్ర‌మే విరిగింది. అతడు ప్రాణాల‌తో బ‌య‌ట ప‌డ్డాడని వైద్యులు తెలిపారు. కాగా, రెండు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని షమ్లీ జిల్లాలోని ఆసుపత్రిలో ఉన్న క్వారంటైన్‌ వార్డులో కరోనా లక్షణాలతో చేరిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అంతకు ముందు  కరోనా వచ్చిందన్న అనుమానంతో ఇటీవలే సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కరివిరాల గ్రామంలో శ్రీనివాస్‌ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.



More Telugu News