పెయింటింగ్‌ వేసే చేతులతోనే 'సాయం చేయండి' అని రాసిన పెయింటర్‌!

  • చండీగఢ్‌లో ఘటన
  • కన్నీరు పెట్టిస్తోన్న పెయింటర్‌ బాధలు
  • డొనేషన్‌ బాక్స్‌ పెట్టిన వైనం
గోడలకు పెయింటింగ్‌ వేసుకుంటూ బతికేవారు. వచ్చిన దినసరి కూలీతో కడుపునింపుకునే వారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆ డబ్బు కూడా అందకుండాపోతోంది. ఆకలితో అలమటిస్తున్నారు. తమకు తెలిసిన పెయింటింగ్‌ కళతోనే తమ బాధను చెప్పుకుంటున్నారు. చండీగఢ్-పాలకుంచ ప్రాంతంలో నివసించే ఓ పెయింటర్‌ వేసిన పెయింట్‌ అందరితో కన్నీరు పెట్టిస్తోంది. గోడలపై రకరకాల పెయింటింగ్‌లు వేసే ఓ పెయింటర్‌ అదే చేతులతో 'మమ్మల్ని కాపాడండి' అని తన ఇంటి గోడపై రాశాడు.

డబ్బు లేక ఆహారాన్ని తమకు అందించాలని పవార్‌ కుమార్‌ కోరుతున్నాడు. కొన్ని రోజులుగా తనకు ఏ పనీ దొరకకపోవడంతో తమ కుటుంబం ఇబ్బందుల్లో పడిందని తెలిపాడు. తనకు ఎవరైనా సాయం చేస్తే తన పిల్లలు అన్నం తినగలుగుతారని చెప్పాడు. తమ జిల్లా అధికారులు ఇప్పటివరకు తమకు ఎలాంటి సాయాన్నీ అందించలేదని తెలిపాడు. తమ నివాసం ప్రాంతంలో డొనేషన్‌ బాక్స్‌ పెట్టాడు.



More Telugu News