కరోనా ఉందని ఏనుగులకూ తెలిసిందేమో... సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ రోడ్డు దాటుతున్న వీడియో!
- ఐఎఫ్ఎస్ అధికారి షేర్ చేసిన వీడియో
- ఒకదాని కొకటి దూరంగా ఏనుగులు
- నెటిజన్ల కామెంట్లతో వైరల్
కరోనా వైరస్ విజృంభించిన వేళ, ప్రజలంతా సామాజిక దూరాన్ని పాటించాలని, ఒకరికి ఒకరు దగ్గరగా ఉండకుండా ఉంటే వైరస్ సోకే అవకాశాలు తక్కువని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.
ఇదే సమయంలో ఓ ఏనుగుల గుంపు, సామాజిక దూరాన్ని పాటిస్తూ, రోడ్డు దాటుతున్న వీడియో ఒకటి బయటకు రావడంతో, ఏనుగులకు కరోనా గురించి తెలిసిపోయినట్లుందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ పర్వీన్ కశ్వాన్ తన ట్విటర్ ఖాతాలో "తమ గున్న ఏనుగులను మధ్యలో పెట్టుకొని అత్యంత పటిష్ట భద్రత నడుమ రోడ్డు దాటడం ఆసక్తి కలిగించింది" అన్న క్యాప్షన్ తో షేర్ చేశారు.
ఇక దీన్ని చూసిన వారు సోషల్ డిస్టెన్సింగ్ ను, అదే సమయంలో ప్రజల మాదిరిగానే, కొన్ని ఏనుగులు నిబంధనలను అతిక్రమిస్తున్నాయని, వాటిని దారిలో పెట్టేందుకు పెద్ద ఏనుగులు ప్రయత్నిస్తున్నాయని, తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. ఆ వీడియోను మీరూ చూడండి.