భారత్‌లోకి చొరబడేందుకు ఉగ్రవాదుల యత్నం.. 9 మంది హతం
- జమ్మూకశ్మీర్‌లో చొరబాట్లకు ప్రయత్నాలు
- కశ్మీర్ లోయలో ఎదురు కాల్పులు
- 24 గంటలుగా ఆర్మీ ఆపరేషన్
- ఓ జవాను వీరమరణం
భారత్ కరోనా సమస్యతో సతమతమవుతోంటే ఉగ్రవాదులు తమ పని తాము చేసుకుపోతున్నారు. జమ్మూకశ్మీర్‌లో చొరబాట్లకు ఉగ్రవాదులు ప్రయత్నాలు జరుపుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన భారత భద్రతా బలగాలు కశ్మీర్ లోయలో ఉగ్రవాదులను చుట్టుముట్టాయి. దీంతో ఉగ్రవాదులు జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు.
ఎదురు కాల్పుల్లో తొమ్మిది మంది ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు హతమార్చాయి. 24 గంటలుగా ఆ ప్రాంతాల్లో ఆర్మీ ఆపరేషన్ కొనసాగుతోంది. సౌత్ బత్పురలో నలుగురు ఉగ్రవాదులు, కెరన్ సెక్టార్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారని అధికారులు ప్రకటించారు. ఈ ఎదురు కాల్పుల్లో ఓ జవాను అమరుడయ్యాడని తెలిపారు. మరో ఇద్దరు జవాన్లకు తీవ్రగాయాలయ్యాయి.